AP: చిలకలూరిపేటలో బిర్యాని హోటల్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. మద్యం మత్తులో ఉన్న యువతి, యువకులు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి హోటల్ వైపు దూసుకెళ్లింది. బ్యాంక్ ఆఫ్ బరోడా సమీపంలో జరిగిన ఈ ఘటనలో, హోటల్ ముందున్న పెద్ద కటౌట్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణాపాయం జరగలేదు. కారులో ఉన్నవారు మద్యం సేవించినట్లు గుర్తించిన స్థానికులు వారిని ప్రశ్నించగా, యువత వారితో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని యువతి, యువకులను అదుపులోకి తీసుకున్నారు.