వేసవిలో వాతావరణ మార్పుల వల్ల పొడి దగ్గు సమస్య పెరుగుతోంది. గాలిలోని దుమ్ము, కాలుష్యం దీనికి కారణమవుతాయి. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో ఇది సర్వసాధారణం. పొడి దగ్గు రెండు వారాల పాటు ఉంటుంది. గొంతులో గరగర, మంట, పొడిబారడం, రాత్రిపూట దగ్గు తీవ్రమవడం దీని లక్షణాలు. నివారణకు రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి, సమతుల్య ఆహారం తీసుకోవాలి, నీళ్లు ఎక్కువగా తాగాలి, కాలుష్యానికి దూరంగా ఉండాలి. వేడి నీటి ఆవిరి, ఉప్పు నీటితో పుక్కిలించడం కూడా ఉపకరిస్తాయి.