విమాన ప్రయాణంలో చర్మం పొడిబారడం, నిర్జీవంగా మారడం వంటి సమస్యలు 'ఎయిర్ పోర్ట్ స్కిన్' గా పిలుస్తారు. విమాన క్యాబిన్‌లో తేమ శాతం 10-20 శాతానికి పడిపోవడం, ప్రయాణ ఒత్తిడి, నిద్రలేమి, యూవీ కిరణాలు దీనికి కారణాలని చర్మ వ్యాధి నిపుణులు తెలిపారు. ఈ సమస్యను అధిగమించడానికి పుష్కలంగా నీరు తాగడం, మాయిశ్చరైజర్ వాడటం, సన్ స్క్రీన్ రాసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.