రాబోయే 3 రోజుల్లో తెలంగాణలో పొడి వాతావరణం

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నేపథ్యంలో, హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలంగాణలో రాబోయే మూడు రోజులు పొడి వాతావరణం ఉంటుందని అంచనా వేసింది. అయితే, మలక్కా స్ట్రైట్ ప్రాంతంలో ఏర్పడిన 'సనియార్' తుఫాన్ ఇండోనేషియా తీరాన్ని దాటింది. మరోవైపు, శ్రీలంక తీరం సమీపంలో కొనసాగుతున్న అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారి, రాగల 48 గం. ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీరానికి చేరే అవకాశం ఉంది. కానీ తెలంగాణపై దీని ప్రభావం ఉండదని వాతావరణ శాఖ తెలిపింది.

సంబంధిత పోస్ట్