AP: విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సంచలన ప్రకటన చేశారు. డీఎస్సీ నిరుద్యోగులకు ఆయన శుభవార్త చెప్పారు. ఈ నెలలోనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కానుందని ఆయన వెల్లడించారు. ఈ మేరకు తమ శాఖ అధికారులు చర్యలు తీసుకున్నారని, వీలైనంత త్వరగా ప్రకటన విడుదల చేస్తామని ఆయన అన్నారు. ఇక, ఎన్నడూ లేని విధంగా ఉపాధ్యాయుల బదిలీలను అత్యంత పారదర్శకంగా నిర్వహించామని స్పష్టం చేశారు.