పెళ్లి చేసుకుంటే రూ.12 లక్షలు.. ఉద్యోగులకు కంపెనీ ఆఫర్

దుబాయ్‌కి చెందిన బిలియనీర్ వ్యాపారవేత్త ఖలాఫ్ అహ్మద్ అల్ హబ్తూర్, తన అల్ హబ్తూర్ గ్రూప్‌లోని ఎమిరేట్‌ ఉద్యోగులకు వివాహం, పిల్లలను ప్రోత్సహించడానికి ఆకర్షణీయమైన ఆఫర్‌ ప్రకటించారు. సోషల్‌ మీడియా ఎక్స్‌లో వెల్లడించిన ఈ ఆఫర్ ప్రకారం.. పెళ్లి చేసుకున్న వారికి రూ.12 లక్షలు, పిల్లలు పుట్టిన ప్రతిసారీ మరో రూ.12 లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపారు. కుటుంబాలు దేశానికి కీలకమని, పిల్లలు భవిష్యత్తుకు పెట్టుబడి అని ఆయన అన్నారు. గతంలోనూ యువకులను వివాహం చేసుకోవాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్