సిక్స్‌లతో హోరెత్తించిన దూబె.. హాఫ్ సెంచరీ పూర్తి

న్యూజిలాండ్‌తో జరుగుతున్న నాలుగో టీ20లో భారత బ్యాటర్ శివమ్ దూబె సిక్స్‌లతో హోరెత్తిస్తున్నాడు. కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆయన ఇన్నింగ్స్‌లో 6 సిక్స్‌లు, 2 ఫోర్లు ఉన్నాయి. ఓ వైపు వికెట్లు పడుతున్నా దూకుడుగా ఆడుతూ భారత్ తరఫున 3వ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ప్రస్తుతం భారత్ 14 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 134 పరుగులు చేసింది. క్రీజులో దూబె (54*), హర్షిత్ రాణా (4*) ఉన్నారు.

సంబంధిత పోస్ట్