డ్యూచెన్ మస్కులర్ డిస్ట్రోఫీ వ్యాధి లక్షణాలు సాధారణంగా 3 నుండి 5 ఏళ్ల వయసులో బయటపడతాయి. పిల్లలు బాతు నడకలా నడవడం లేదా కాలి వేళ్ల మీద నడవడం, తరచుగా పడిపోవడం, మెట్లు ఎక్కడం కష్టమవడం వంటివి ముఖ్య లక్షణాలు. నేల మీద లేదా మోకాళ్ల మీద చేతులు పెట్టి సపోర్ట్ తీసుకుని లేవడం కూడా కనిపిస్తుంది. పిక్కల కండరాలు లావుగా కనిపించినా అవి బలంగా ఉండవు.