లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతోన్న టెస్టులో టీమిండియా ‘డ్యూక్స్’ బాల్‌తో ఇబ్బంది పడుతోంది. రెండో రోజు ఆటలో పది ఓవర్లు వేసిన తర్వాత కొత్త బంతి షేప్ మారిపోయింది. దీంతో అంపైర్ ఎంపిక చేసిన మరో బంతి మరీ పాతగా ఉండటంతో గిల్, సిరాజ్ అసహనానికి గురయ్యారు. ఈ విషయంపై గిల్ అంపైర్‌తో చాలాసేపు వాదించాడు. ఆ తర్వాత కొన్ని ఓవర్లు వేయగానే ఆ బంతి కూడా షేప్ కోల్పోయింది. దీంతో మరో బంతి తీసుకోవాల్సి వచ్చింది.