అసెంబ్లీ సమావేశాల వేళ.. బీఆర్ఎస్ శ్రేణులకు షాకిచ్చిన కేసీఆర్!

తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జనవరి 2వ తేదీ నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. అయితే ఈ సమావేశాల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాల్గొని ప్రభుత్వాన్ని నిలదీస్తారని ఆశగా ఎదురుచూసిన పార్టీ శ్రేణులకు షాక్ తగిలినట్లు తెలుస్తోంది. ఇప్పటిదాకా హైదరాబాద్‌లోని నంది నగర్ నివాసంలో ఉన్న కేసీఆర్.. తాజాగా ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కు చేరుకున్నారు. అసెంబ్లీ తొలిరోజు సభకు హాజరైన కేసీఆర్ తిరిగి ఫామ్‌హౌస్‌కు వెళ్లిపోవడంతో ఆయన ఎల్లుండి జరగబోయే సమావేశాల్లో పాల్గొంటారా లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

సంబంధిత పోస్ట్