పండగ సీజన్‌ వేళ.. భారీగా పెరగనున్న ఏసీ, టీవీల ధరలు

పండగ సీజన్‌కు ముందు వినియోగదారులకు కన్జూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ కంపెనీలు షాక్‌ ఇచ్చాయి. ఏసీలు, ఎల్‌ఈడీ టీవీలు, వాషింగ్‌ మెషిన్లు, రిఫ్రిజిరేటర్లు సహా గృహోపకరణాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. అక్టోబర్‌ 1 నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. ఏసీల ధరలు 5-8 శాతం, ఇతర ఉత్పత్తుల ధరలు 3-4 శాతం వరకు పెరగనున్నాయి. కాపర్‌, స్టీల్‌, ప్లాస్టిక్‌ వంటి ముడిపదార్థాల ధరల పెరుగుదల, రూపాయి విలువలో హెచ్చుతగ్గులు, పశ్చిమాసియా ఉద్రిక్తతలు ఇందుకు కారణాలుగా కంపెనీలు పేర్కొన్నాయి. అయితే డీలర్ల వద్ద ఉన్న పాత స్టాక్‌ కారణంగా దీపావళి వరకు కొన్ని ఉత్పత్తులు పాత ధరలకే లభించే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్

✕
✕