స్మోకిన్ స్పాట్ అవుట్‌లెట్‌పై ఈగల్ ఫోర్స్, పోలీసుల దాడులు

TG: హైదరాబాద్‌లో నిషేధిత వేప్స్ విక్రయిస్తున్న ‘స్మోకిన్ స్పాట్’ అవుట్‌లెట్‌పై ఈగల్ తెలంగాణ, రాయదుర్గం పోలీసులు దాడులు చేశారు. మేనేజర్‌ అబూబకర్ సిద్ధిఖీని అరెస్ట్ చేసి 46 వేప్స్, 49 విదేశీ సిగరెట్ ప్యాకెట్లు, 2 మొబైల్ ఫోన్లు, 2 పేమెంట్ స్కానర్లను స్వాధీనం చేసుకున్నారు. ఒక్కో వేప్‌ను రూ.2,800 నుంచి రూ.4,000 వరకు విక్రయించినట్లు గుర్తించారు. వాట్సాప్ ద్వారా ఆర్డర్లు తీసుకుని, డిజిటల్ చెల్లింపులు, నగదు రూపంలో డబ్బులు వసూలు చేసినట్లు తెలుస్తోంది. రాపిడో ద్వారా కస్టమర్ల ఇళ్లకే డెలివరీలు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕