ఈ-సిగరెట్ల దందాపై EAGLE దాడులు.. నలుగురు అరెస్ట్

TG: హైదరాబాద్ మాదాపూర్‌లో EAGLE ఫోర్స్, పోలీసులు సంయుక్తంగా ‘స్మోకిన్ స్పాట్’, ‘హోలీ స్మోక్’ షాపులపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో నలుగురిని అరెస్ట్ చేసి, 92 నిషేధిత వేప్స్, 15 విదేశీ సిగరెట్ ప్యాకెట్లు, రెండు స్కానర్లు స్వాధీనం చేసుకున్నారు. ‘స్మోకిన్ స్పాట్’ యజమాని కేరళలో ఉండగా, ఉద్యోగులు షాపును నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. వాట్సాప్ గ్రూప్, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రచారం చేస్తూ, బ్యాంకు ఖాతాల్లో చెల్లింపులు స్వీకరించి, ర్యాపిడో ద్వారా డెలివరీలు చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕