తెలంగాణలో B.tech, B.Pharmతోపాటు BSc అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే EAPCET దరఖాస్తుల స్వీకరణ వాయిదా పడింది. ఇటీవల ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. మంగళవారం సా.4.45 గంటల నుంచి దరఖాస్తులు స్వీకరణ ప్రారంభం కావాల్సి ఉండగా.. దాన్ని మార్చి 1కి వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఎప్‌సెట్ కన్వీనర్ డీన్ కుమార్ ఓ ప్రకటనలో వెల్లడించారు. తాజా నిర్ణయంతో మార్చి 1 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ మొదలవుతుంది.