సాధారణంగా 12 నుంచి 15 ఏళ్ల మధ్య అమ్మాయిలు రజస్వల అవుతుండగా, ప్రస్తుతం 8 ఏళ్లకే ఈ ప్రక్రియ మొదలవుతోందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల ఎముకల ఎదుగుదల ఆగిపోవడం, చిన్న వయసులోనే మెనోపాజ్ రావడం, పునరుత్పత్తి క్యాన్సర్లు, హృదయ సంబంధ వ్యాధులు, హార్మోన్ల అసమతుల్యత, డిప్రెషన్ వంటి సమస్యలు తలెత్తుతున్నాయని నిపుణులు తెలిపారు. అధిక బరువు, ఊబకాయం, శారీరక శ్రమ లేకపోవడం, స్క్రీన్ టైమ్ పెరగడం, కుటుంబ చరిత్ర వంటివి దీనికి కారణాలుగా పేర్కొన్నారు.