ఏపీలో మరోసారి భూకంపం

ఏపీలో మరోసారి భూకంపం సంభవించింది. ప్రకాశం జిల్లా మండ్లమూరు మండలంలో మరోసారి భూ ప్రకంపనలు స్థానికులకు కునుకు లేకుండా చేస్తున్నాయి. రాత్రి 8.15 నిమిషాలకు, 8.16కు, 8.19 నిమిషాలకు వరుసగా మూడు సార్లు పెద్ద శబ్ధంతో భూమి కంపించినట్లు స్థానికులు చెబుతున్నారు. పెద్ద శబ్ధం రావడంతో స్థానికులు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. గత మూడు రోజులుగా ముండ్లమూరులో వరుస భూ ప్రకంపనలు సంభవిస్తున్నాయి.

సంబంధిత పోస్ట్