ఏపీలో భూకంపం... ఇళ్ల నుంచి పరుగులు తీసిన జనం

AP: కర్నూలు జిల్లాలో హఠాత్తుగా భూకంపం సంభవించింది. కర్నూలు, ఆదోని పరిసర ప్రాంతాల్లో భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇళ్లలోని వస్తువులు కదిలిపోయాయి. చిన్నపిల్లలు, వృద్ధులతో సహా ప్రజలు వీధుల్లోకి పరుగులు తీశారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.5గా నమోదైంది. భూ అంతర్భాగంలో జరిగిన చిన్నపాటి సర్దుబాట్ల వల్లే ఈ ప్రకంపనలు చోటుచేసుకున్నాయని, తీవ్రత తక్కువగా ఉండటం వల్ల పెద్దగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్

✕
✕