దేశ రాజధాని ఢిల్లీలో కాసేపటి క్రితం స్వల్ప భూకంపం వచ్చిన సంగతి తెలిసిందే. అయితే కొన్ని గంటల వ్యవధిలోనే బీహార్‌లోనూ 4.0 తీవ్రతతో భూ ప్రకంపనలు సంభవించాయి. బీహార్‌లోని శివాన్ దగ్గర భూకంప కేంద్రాన్ని అధికారులు గుర్తించారు. భూ ప్రకంపనలు రావడంతో జనం భయంతో పరుగులు తీశారు.