హిమాచల్ ప్రదేశ్‌లో శుక్రవారం ఉదయం స్వల్ప భూకంప ప్రకంపనలు నమోదయ్యాయి. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.5గా నమోదైంది. ఈ భూకంపం వల్ల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అయితే, ఈ ప్రకంపనల కారణంగా ఎటువంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్టు ఇప్పటివరకు సమాచారం లేదు. అధికారులు పరిస్థితిని పరిశీలిస్తున్నారు.