ఇండోనేషియాలో సంభవించిన భారీ భూకంపం కారణంగా ఇప్పటివరకు 20 మంది మరణించగా, మరో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. కూలిపోయిన భవనాల వద్ద అధికారులు సహాయక చర్యలను ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. మొదట సునామీ హెచ్చరికలు జారీ చేయగా.. పరిస్థితులను సమీక్షించిన తర్వాత ఉపసంహరించారు.