జమ్ముకశ్మీర్‌లో భూకంపం.. 5.2 తీవ్రత నమోదు

కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్‌తో పాటు జమ్ముకశ్మీర్‌లో భూమి కంపించింది. హోలీ రోజున తెల్లవారుజామున 2.50 గంటలకు లడఖ్‌లోని కార్గిల్‌లో 5.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ ప్రకంపనలు జమ్ముకశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాలలోనూ కనిపించాయి. భూకంప కేంద్రం 15 కిలోమీటర్ల లోతులో ఉందని నేషనల్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. అరుణాచల్‌ ప్రదేశ్‌లోని పశ్చిమ కామెంగ్ ప్రాంతంలో కూడా 4.0 తీవ్రతతో భూకంపం సంభవించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్