కోల్‌కతా సమీప ప్రాంతంలో మంగళవారం ఉదయం 6.10గంటలకు భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. బంగాళఖాతంలోని 91కి.మీ దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 5.1గా నమోదు అయింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.