నేపాల్‌లోని కోషి ప్రావిన్స్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 5.3గా నమోదైనట్లు ఈఎమ్ఎస్సీ వెల్లడించింది. భూకంప కేంద్రం 10 కి.మీ లోతులో ఉన్నట్లు గుర్తించారు. దీని ప్రభావంతో భారత్, బంగ్లాదేశ్, భూటాన్, చైనాలోని పలు ప్రాంతాల్లో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. అయితే, ప్రస్తుతానికి ఈ ప్రకృతి వైపరీత్యం వల్ల జరిగిన ప్రాణ లేదా ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు వెల్లడి కాలేదు.