పాకిస్థాన్‌లో భూకంపం

పాకిస్థాన్‌లో తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 5.2గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. వెస్ట్ ముల్తాన్ సిటీకి 149 కి.మి దూరంలో భూమి కంపించినట్లు తెలుస్తోంది. భూమి నుంచి 10కి.మీ. లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఈ ఘటన వల్ల జరిగిన ప్రాణ, ఆస్తి నష్ట వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్