ఇటలీలో భూకంపం సంభవించింది. అక్కడి కాలబ్రియా ప్రాంతంలో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.0గా నమోదైందని సంబంధిత అధికారులు తెలిపారు. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.