పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ మనోజ్ అగర్వాల్‌ను అవినీతి ఆరోపణల పేరుతో బెదిరించినట్లు వార్తలు వెలువడడంతో కేంద్ర ఎన్నికల సంఘం (EC) కఠినంగా స్పందించింది. మమతా వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో, అనువాద ప్రతిని అందజేయాలని సీఈవో కార్యాలయానికి ఈసీ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.