పన్నీర్ స్వచ్ఛతను గుర్తించే సులభమైన మార్గాలు

ఆహార పదార్థాలలో ఎక్కువగా కల్తీ అయ్యేవి పాల ఉత్పత్తులే, అందులో పన్నీర్ కూడా ఒకటి. స్వచ్ఛమైన పన్నీర్ మెత్తగా, క్రీమీగా ఉండి పాల వాసన వస్తుంది. ప్యాకెట్ కొనేటప్పుడు FSSAI లేబుల్ గమనించాలి. చేతితో నలిపితే విరిగిపోతే స్వచ్ఛమైనది, లేదంటే కల్తీ. పనీర్‌ను వేడి నీటిలో కాసేపు ఉడకబెట్టి, చల్లారాక, అందులో కొద్దిగా కందిపప్పు పొడి లేదా సోయాబీన్ పొడి వేసి 10 నిమిషాలు ఉంచండి. అది లేత ఎరుపు రంగులోకి మారితే అందులో డిటర్జెంట్ లేదా యూరియా కలిసినట్లు అర్థం.

సంబంధిత పోస్ట్