పల్లీలు తింటే గుండెకు మేలు!

మన వంటింట్లో నిత్యం కనిపించే పల్లీలలో ఉండే పోషకాలు ఖరీదైన బాదం, జీడిపప్పులో వ్ఉండే వాటికంటే తక్కువేమీ కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిలో ఉండే మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండెను పదిలంగా ఉంచుతాయి. రెస్వెరాట్రాల్, ఒలిక్ ఆమ్లం, ఆర్జినైన్ వంటివి రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. మెగ్నీషియం, పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచుతాయి. పీచుపదార్థం, ప్రోటీన్ అధికంగా ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇవి మంచి ఎంపిక.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్