అరటి పండును ఖాళీ కడుపుతో తినడం ప్రమాదకరం!

తక్షణ శక్తినిచ్చే అరటిపండును ఖాళీ కడుపుతో తినడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు అని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అరటి పండులో పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ B6, పీచు పదార్థం పుష్కలంగా ఉన్నప్పటికీ, ఖాళీ కడుపుతో తింటే సహజ చక్కెరలు రక్తంలో చక్కెర స్థాయిలను ఒక్కసారిగా పెంచి, ఆ తర్వాత వేగంగా తగ్గిస్తాయి. దీనివల్ల అలసట, ఆకలి వంటి సమస్యలు వస్తాయి. మెగ్నీషియం అధికంగా ఉండటం వల్ల రక్తంలో మెగ్నీషియం, కాల్షియంల సమతుల్యత దెబ్బతిని గుండె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు. గ్యాస్, కడుపు ఉబ్బరం, గుండెల్లో మంట వంటివి కూడా రావచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్