వర్షాకాలంలో చేపలు తినడం ప్రమాదకరం: ఆరోగ్య నిపుణులు

వర్షాల వల్ల నదులు, చెరువులు కలుషితమై, చేపల్లో హానికరమైన బ్యాక్టీరియా చేరుతుంది. వీటిని తినడం వల్ల గ్యాస్ట్రోఎంటరైటిస్, టైఫాయిడ్, కలరా వంటి వ్యాధులు వస్తాయి. జంతువుల మూత్రం ద్వారా లెప్టోస్పిరోసిస్ వంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు నీటిలో కలిసి చేపల ద్వారా మనుషులకు సోకుతాయి. రవాణా ఆలస్యం, అధిక తేమ వల్ల చేపలు త్వరగా కుళ్లిపోతాయి. వ్యాపారులు పరిశుభ్రత పాటించకపోవడం కూడా కాలుష్యానికి కారణమవుతుంది. వర్షాకాలం చేపల సంతానోత్పత్తి కాలం కాబట్టి, వేట వల్ల వాటి జనాభా అంతరించిపోయే ప్రమాదం ఉంది. పర్యావరణ సమతుల్యత కోసం, ఆరోగ్యం కోసం మూడు నాలుగు నెలల పాటు చేపలకు దూరంగా ఉండటం మంచిది.

సంబంధిత పోస్ట్