గోంగూరలో ఉండే పొటాషియం, మెగ్నీషియం లివర్‌లో టాక్సిన్స్‌ను తగ్గించి కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తాయి. హైబీపీకి ఉపశమనం కలిగిస్తుంది. గోంగూరలోని క్లోరోఫిల్స్ క్యాన్సర్ కణాల పెరుగుదల్ని నియంత్రిస్తాయి. ఐరన్ వంటి ఖనిజాల వల్ల రక్త ప్రసరణ మెరుగవుతుంది. గోంగూర రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించి మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. ప్రతి రోజు ఆహారంలో గోంగూరను చేర్చడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.