వర్షాకాలంలో కొందరు పచ్చళ్లు అధికంగా తింటుంటారు. అయితే దీని వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఊరగాయ పచ్చళ్లలో నూనె పదార్థం ఎక్కువగా ఉంటుంది. అది కొలెస్ట్రాల్ పెరగడానికి కారణమవుతుంది. పచ్చళ్లను ఎక్కువగా తింటే శరీరంలో ఎసిడిటీ, మంట ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. ఊరగాయలలో ఉప్పు ఎక్కువగా వాడటం వల్ల అధిక రక్తపోటు, ఇతర ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. క్రమం తప్పకుండా పచ్చళ్లు తింటే అల్సర్ వచ్చే ప్రమాదం ఉంది.