టమాటా ధరలు అమాంతం పెరగడం, తగ్గడం సర్వసాధారణం. అయితే, టమాటాలను అతిగా తినడం వల్ల కడుపు మంట, అజీర్తి, జీర్ణ సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రక్తం గడ్డకట్టని వారు, కిడ్నీలో రాళ్లు ఉన్నవారు, అలర్జీ సమస్యలు ఉన్నవారు టమాటాలను ఎక్కువగా తినకపోవడమే మంచిదని అంటున్నారు. ఎందుకంటే వీటిలోని ఆక్సలేట్ కిడ్నీలో రాళ్లను పెంచుతుందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. వైద్యుల సలహా మేరకు టమాటాలను వినియోగించాలని నిపుణులు సూచిస్తున్నారు.