నేరేడు పండు ఆరోగ్యానికి మేలు చేస్తుంది అనేది నిజమే కానీ, మితిమీరి తింటే ప్రమాదకరం అని నిపుణులు చెప్తున్నారు. ఇందులో ఉండే ఆక్సలేట్లు మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని పెంచుతాయి. అధికంగా తినడం వల్ల తలనొప్పి, తిమ్మిర్లు, జీర్ణ సమస్యలు, దంతాలపై దుష్ప్రభావం చూపుతాయి. గర్భిణీలు 6 నెలల తర్వాత తినాలంటే తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. రోజుకు 100 గ్రాములకు మించి తినకపోవడం ఉత్తమం.