పొట్టు మినపప్పుతో ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. వీటిలో ప్రొటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఫైబర్, మెగ్నీషియం, ఐరన్, పొటాషియం, పాస్పరస్, కాల్షియంతోపాటు ఎన్నో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. వీటిని తినడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. ఇంకా జీర్ణక్రియ మెరుగుపడుతుంది. పొట్టు మినపప్పులో ఉండే బి-విటమిన్లు , ఇతర ఖనిజాలు మెదడు ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. మలబద్ధకం, అజీర్ణం సమస్యలు కూడా దూరమవుతాయి.