ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఈసీ కసరత్తు

జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల నగరా మోగనుంది. సుప్రీంకోర్టు ఇచ్చిన సెప్టెంబర్‌ 30వ తేదీ గడువు లోగా అక్కడ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ సన్నద్దం అవుతోంది. ఈ క్రమంలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన సన్నాహాలను సమీక్షించేందుకు ఈసీ బఅందం ఈ నెల 8 నుంచి 10వ తేదీ వరకూ జమ్మూకశ్మీర్‌ లో పర్యటించనున్నది. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, ఎస్ఎస్ సంధు పర్యటించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్