కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపణలపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) స్పందించింది. ఆన్‌లైన్‌లో ఎవరూ ఓట్లు తొలగించలేరని, రాహుల్ ఆరోపణలు నిరాధారమని ఈసీ స్పష్టం చేసింది. సంబంధిత వ్యక్తికి సమాచారం ఇవ్వకుండా ఏ ఒక్కరి ఓటునూ తొలగించడం జరగదని క్లారిటీ ఇచ్చింది. రాహుల్ వ్యాఖ్యలను BJP సైతం తీవ్రంగా ఖండించింది. ఆయన ఆరోపణల బాంబు పేలలేదంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించింది.