రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. రూ.17వేల కోట్ల విలువైన రుణ మోసానికి సంబంధించిన కేసులో దర్యాప్తు సంస్థ ఆయనపై చర్యలు చేపట్టింది. ఆగస్టు 5న విచారణకు రావాలని ఈడీ ఆదేశించింది. ఇటీవల అనిల్ అంబానీకి చెందిన పలు కార్యాలయాల్లో ఈడీ సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో తాజాగా అనిల్ అంబానీకి ఈడీ నోటీసులు జారీ చేసింది.