TG: గంజాయి లేడీ డాన్ నీతూబాయి కుటుంబసభ్యులు 11 మందికి ఈడీ నోటీసులు జారీ ఇచ్చింది. ఇప్పటికే నీతూబాయి భర్త మునుసింగ్, కుమార్తె నేహా ఈడీ విచారణకు హాజరయ్యారు. సోమవారం నీతూబాయి తోడికోడలు సురేఖ బాయి ఈడీ విచారణకు వచ్చింది. కాగా నీతూబాయి ఐటీ కారిడార్ ప్రాంతంలోని సాఫ్ట్‌వేర్ ఉద్యోగులే లక్ష్యంగా రహస్యంగా గంజాయి విక్రయాలను సాగిస్తూ రోజూ రూ.లక్షల్లో అక్రమంగా సంపాదించినట్లు ఆరోపణలు ఉన్నాయి.