గొర్రెల పంపిణీ కేసుపై ఈడీ ప్రకటన

TG: గొర్రెల పంపిణీ కేసుపై శుక్రవారం ఈడీ ప్రకటన విడుదల చేసింది. ‘ఈ పథకంలో రూ.వెయ్యి కోట్లకు పైగా అక్రమాలు జరిగినట్లు గుర్తించాం. మాజీ మంత్రి తలసాని మాజీ ఓఎస్డీ కళ్యాణ్ ఇంట్లో సోదాలు నిర్వహించాం. 200కు పైగా బ్యాంక్ పాస్‌బుక్‌లు సీజ్ చేశాం. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్‌లోనూ ఈ బ్యాంక్ ఖాతాలను ఉపయోగించారు. 31 మొబైల్స్, 20 సిమ్‌కార్డులు స్వాధీనం చేసుకున్నాం. కాగ్ నివేదికల్లో రూ.253.93 కోట్ల అక్రమాలు జరిగినట్లు ఉంది’ అని ఈడీ ప్రకటనలో పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్