ఎడ్యుకేట్ గర్ల్స్ ఎన్జీవోకు రామన్ మెగసెసే అవార్డు

రాజస్థాన్ కు చెందిన ప్రముఖ ఎన్జీవో 'ఎడ్యుకేట్ గర్ల్స్' 2025 రామన్ మెగసెసే అవార్డును గెలుచుకుంది. ఈ ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్న మొట్టమొదటి భారతీయ సంస్థగా ఎడ్యుకేట్ గర్ల్స్ చరిత్ర సృష్టించింది. ఆసియా నోబెల్ బహుమతిగా పిలిచే ఈ అవార్డును సమాజ సేవ చేసే వ్యక్తులు, సంస్థలకు అందజేస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో బడి బయట ఉన్న బాలికల విద్య కోసం కృషి చేస్తున్నందుకు ఈ సంస్థకు అవార్డు లభించింది.

సంబంధిత పోస్ట్