ఏడుపాయల మహాజాతర.. ఫిబ్రవరి 15 నుంచి 17 వరకు బ్రహ్మోత్సవాలు

తెలంగాణలో మేడారం తర్వాత రెండో అతిపెద్ద జాతరగా పేరొందిన మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని ఏడుపాయల వనదుర్గా భవాని మాత మహాజాతర ఫిబ్రవరి 15 నుంచి 17 వరకు మూడు రోజుల పాటు ఘనంగా జరగనుంది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా, భక్తులు మంజీరా నదిలో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకుంటారు. ఫిబ్రవరి 16న ప్రధాన ఘట్టమైన 'బండ్ల ఉత్సవం' కోలాహలంగా సాగనుంది. 17న రథోత్సవంతో జాతర ముగియనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్