AP: అనకాపల్లి జిల్లా నక్కపల్లిలోని జాతీయ రహదారిపై రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నడుచుకుంటూ వెళ్తున్న ముగ్గురు మహిళా ఉపాధి కూలీలను ఒక ఐచర్ వాహనం ఢీకొట్టింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురిలో ఒకరైన నక్కపల్లి హరిజన కాలనీకి చెందిన బద్దా సత్యవతి మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.