TG: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో వన్యప్రాణులను తరలిస్తున్నారనే సమాచారంతో SOT పోలీసులు తనిఖీలు నిర్వహించి, కారులో 13 కిలోల జింక మాంసం, వేటకు ఉపయోగించినట్లు భావిస్తున్న ఒక రైఫిల్‌తో పాటు 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. షాద్‌నగర్ టోల్‌ప్లాజా వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. పట్టుబడిన వారిని కొత్తూరు పోలీసులకు అప్పగించి, అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద నిందితులపై చర్యలు తీసుకుని రిమాండ్‌కు తరలించారు.