భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఎల్‌నినోపై హెచ్చరికలు జారీ చేసింది. భూమధ్యరేఖా పసిఫిక్ మహాసముద్రంలో ఎల్‌నినో పరిస్థితులు అధికారికంగా ప్రారంభమయ్యాయని, వర్షాకాలంలో మరింత బలపడతాయని తెలిపింది. దీనివల్ల దేశవ్యాప్తంగా వర్షపాతం, ఉష్ణోగ్రతలపై ప్రభావం పడే అవకాశాలున్నాయని హెచ్చరించింది. నినో 3.4 ఇండెక్స్ +0.5 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువకు చేరడంతో ఎల్‌నినో నిర్ధారణ అయింది. రాబోయే నెలల్లో దీని ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉందని, రైతులు, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.