ఎల్‌నినో ఎఫెక్ట్.. ఈసారి వర్షాలు తక్కువా?

ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షాలు సాధారణం కంటే తక్కువగా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఫసిఫిక్ సముద్రంలో జలాలు వేడెక్కడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడి, వర్షాలు తగ్గి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీనిని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. రైతులు భయాందోళన చెందకుండా అత్యవసర ప్రణాళికలు అమలు చేయాలని అధికారులను ఆదేశించింది. రుతుపవనాలు ముందే వచ్చినా, ఖరీఫ్ సీజన్లో ప్రతికూల పరిస్థితులు ఎదురుకావచ్చని అంచనా వేస్తున్నారు.

సంబంధిత పోస్ట్