TG: కొవిడ్ లాంటి సంక్షోభమే ఎల్నినో అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎదురవుతున్న కరవు పరిస్థితులపై ఆయన స్పందిస్తూ, ప్రభుత్వం వద్ద ఆహార ధాన్యాల నిల్వలు ఉన్నప్పటికీ, నీటి ఎద్దడి ప్రధాన సమస్యగా మారిందని తెలిపారు. వచ్చే 8 నెలల పాటు వానలు పడే అవకాశం లేనందున, ఈ సంక్షోభాన్ని అందరూ కలిసికట్టుగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. ఆక్రమణల తొలగింపులో ఎదురవుతున్న న్యాయపరమైన సవాళ్లు, కబ్జాకోరులతో కోర్టులో పోరాతున్నామని ఆయన వివరించారు.