ఎల్నినో ప్రభావంతో వాతావరణంలో మార్పుల కారణంగా ఆరోగ్య సమస్యలు తలెత్తే ముప్పుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎండ తీవ్రత వల్ల జ్వరం, నీరసం, తలనొప్పి, ఒంటినొప్పులు, నిద్రలేమి వంటి లక్షణాలు ఉంటాయి. ఉ.10 గంటల తర్వాత అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదని చెబుతున్నారు. శరీరం డీహైడ్రేషన్ కాకుండా తరచూ నీళ్లు, మజ్జిగ తాగుతూ పౌష్టికాహారం తీసుకోవాలని, అవసరమైతే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.