తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లాలో వృద్ధ దంపతులపై మత్తుమందు చల్లి చోరీకి పాల్పడ్డారు. గర్శకుర్తి గ్రామానికి చెందిన శంకరయ్య(75) మంగళవారం సాయంత్రం ఇంటి వద్ద అలాగే భార్య లక్ష్మి(70) ఇంట్లో స్పృహ తప్పి పడి ఉన్నారు. వారిని స్థానికుల సమాచారంతో పోలీసులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం శంకరయ్య మృతి చెందాడు. భార్య ఇంకా అపస్మారక స్థితిలోనే ఉంది. వృద్ధురాలి మెడలోంచి మంగళసూత్రాన్ని దొంగిలించినట్లు అనుమానిస్తున్నారు.