విద్యుత్‌షాక్‌తో వృద్ధ దంపతులు మృతి

TG: నల్గొండ జిల్లాలో విషాదం నెలకొంది. దేవరకొండ అంజయ్య కాలనీలో విద్యుత్‌షాక్‌ తగిలి వృద్ధ దంపతులు మహమ్మద్ దావుద్ మియా (80), సోఫియా బేగం (60) మృతి చెందారు. ఇంట్లో భార్య సోఫియా బేగం(60) టేబుల్ ఫ్యాన్ స్విచ్ వేస్తుండగా కరెంట్ షాక్ తగిలింది. అది గమనించి భార్యను కాపాడబోయి భర్త కూడా విద్యుత్‌షాక్‌కు గురైనట్లు సమాచారం. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕